ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లాకు 99.5 శాతం తో రాష్ట్రంలోనే మొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉందని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రోజు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాను అగ్రభాగాన నిలబెట్టిన జిల్లా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుండి శుభాకాంక్షలు తెలిపారు.