హైదరాబాద్‌లో పెరుగుతున్న కో-లివింగ్ కల్చర్.. వివాదాలకు దారితీస్తున్న సహజీవనం

ప్రతిపక్షం, జూన్ 16: హైదరాబాద్‌లో కో-లివింగ్, సహజీవనం సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఓ సర్వే ప్రకారం నగరంలోని సుమారు 400 హాస్టళ్లలో 70 వేల మందికి పైగా యువత ఈ విధానంలో నివసిస్తున్నారు. ప్రారంభంలో సౌకర్యవంతంగా కనిపించే ఈ జీవనశైలి, కాలక్రమేణా వ్యక్తిగత విభేదాలు, అపార్థాలు, సంబంధాల్లో సమస్యలకు దారితీస్తోందని తెలుస్తోంది. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోంది. స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటడం, పరస్పర అవగాహన లోపించడం వంటి కారణాలు వివాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News