నూతన రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కౌన్సిలర్ దీపక్ కుమార్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 19: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో కౌన్సిలర్ దీపక్ కుమార్ సుమారు 200 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యం పొందడంతో పాటు, గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ శ్రీనివాస్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.






























