పడిపూజ కార్యక్రమానికి కేటీఆర్ ని ఆహ్వానించిన గుర్ల తిరుమలేష్

ప్రతిపక్షం, నవంబర్ 10: నేతాజీ నగర్‌లో ఈ నెల 15న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ నాయకుడు గుర్ల తిరుమలేష్ ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్‌ను కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్, పడిపూజ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని గుర్ల తిరుమలేష్‌కు తెలిపినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

నేతాజీ నగర్‌లోని గుల్మోహర్ పార్క్‌లో ఈ నెల 15న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు గుర్ల తిరుమలేష్ తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు, స్థానికులు పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన సందర్భంగా వాకిటి శంకర్, వడ్డే శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related News

Latest News