ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 10: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 19న సిద్దిపేటలో సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేటజిల్లా కేంద్రంలో ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ప్రజల రాకపోకలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించి, సభకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈనెల 19నస్ సిద్దిపేట కేంద్రంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్తగా మంజూరైన వృద్ధాప్య పింఛన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉండనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఏఎంసి చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి, చేర్యాల మండలాల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, మంజ మల్లేశం, చేర్యాల పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, ధూలిమిట్ట మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్‌తో, మద్దూర్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ బోయిన్ శ్రీనివాస్ తో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హలో ఆగం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చెరుకు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



























