చండూరులో ఘనంగా భూతరాజు రామయ్య 45వ వర్ధంతి వేడుకలు

*ఆసుపత్రి నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని దానం చేసిన మహానీయుని సేవలు చిరస్మరణీయం.

ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 24: సమాజహితం కోసం ప్రాణత్యాగం చేయడమే కాకుండా, తనకున్న విలువైన ఆస్తులను ప్రజాప్రయోజనాల కోసం దారాదత్తం చేసిన మహనీయుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, అటువంటి కోవకే చెందిన గొప్ప మానవతావాది శ్రీ భూతరాజు రామయ్య అని వక్తలు కొనియాడారు. చండూరు ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అప్పట్లోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రెండు ఎకరాల విశాలమైన భూమిని దానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన దాత, మహానీయులు శ్రీ భూతరాజు రామయ్య 45వ వర్ధంతి వేడుకలు శనివారం చండూరులో అత్యంత ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా రామయ్య కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. నాటి ఆయన దాతృత్వాన్ని, విశిష్ట సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

నాటి త్యాగమే నేడు ప్రజలకు శ్రీరామరక్ష..ఈ కార్యక్రమంలో చండూరు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూతరాజు రామయ్య నాటిన దాతృత్వపు బీజం నేడు వృక్షమై వేలాది మందికి ప్రాణాలు రక్షిస్తోందని ప్రశంసించారు. రామయ్య దానం చేసిన ఆ రెండు ఎకరాల స్థలంలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా నేటికీ చండూరు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఆసుపత్రికి ఆయన చేసిన త్యాగమే మూలస్తంభంగా నిలిచిందని కొనియాడారు. ఆసుపత్రి సిబ్బంది కూడా రామయ్య సేవాభావాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు.

ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో భూతరాజు రామయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు , స్థానిక ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో..భూతరాజు వెంకటేశం, యాదయ్య నారాయణ,భూతరాజు స్రవంతి రమేష్ ,మురళి, వేణు,రామకృష్ణ మణికంఠ,భూతరాజు హేహన్ష్, పగిళ్ళ స్రవంతి, రెవల్లి వెంకటేష్, కొమ్మనపల్లి దశరథ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాంతరం రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, ఆయన చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుచేస్తూనే ఉంటామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News