ప్రతిపక్షం, జూలై 14: అమ్మాయిల కనీస వివాహ వయసును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (SRS), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) గణాంకాల ప్రకారం మహిళల సగటు వివాహ వయసు 19.3 ఏళ్ల నుంచి 23.1 ఏళ్లకు పెరిగినట్లు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 24.4 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్లుగా నమోదైంది.
ఈ నేపథ్యంలో 2027 జనగణన అనంతరం కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 2021లో మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినా, 17వ లోక్‌సభ రద్దుతో అది అమలుకాకుండా నిలిచిపోయింది.


















