కేవీ రెడ్డి అరెస్టుపై కవిత ఆగ్రహం.. “తెలంగాణ ప్రజలు ఏపీకి తొత్తులు కారు”

ప్రతిపక్షం, జూలై 01: తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను అరెస్ట్ చేయడం, ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటని విమర్శించారు.

అరెస్ట్ సమయంలో కేవీ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని ఆమె అన్నారు. తెలంగాణవాదాన్ని వేర్పాటువాదంగా అభివర్ణించిన సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

“తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు. కానీ తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు అలాంటి అవసరం లేదు” అని కవిత వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News