ప్రతిపక్షం, జూన్ 27: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికి టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) లేదా తగిన పరిహారం అందించాలని సూచించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్‌లో ప్రజల కోసం ‘మూసీ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’ ఏర్పాటు చేసి, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి ప్రణాళికలను అందులో ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రాజెక్టు అమలులో ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి, పారదర్శకంగా ముందుకు సాగాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

















