Trending Now

వారికి ఎందుకు షోకాజ్ జారీ చేయరు..? జిల్లా అధ్యక్షుడికి కార్పొరేటర్ వినతి పత్రం

ప్రతిపక్షం, కరీంనగర్: భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను, నాయకులను పార్టీ నుంచి తక్షణమే తొలగించాలని, వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సర్దార్ని కమల్జిత్ కౌర్, రాష్ట్ర నాయకుడు సోహన్ సింగ్ లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిబి రామకృష్ణారావుకు వినతి పత్రాన్ని అందజేయడం కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారింది. నా భర్త సోహన్ సింగ్ కు, నాకు, జిల్లా అధ్యక్షుడు అయిన మీరు చిన్నపాటి వాయిస్ రికార్డింగ్ ను పెద్ద బూచిగా చూపెట్టి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగినదని.. దానికి మేము సమాధానం ఇచ్చినామన్నారు. కానీ, ఇప్పుడు కొంత మంది బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు భూ కబ్జాలు డబ్బులు తీసుకొని మోసం చేయడం అవినీతి ఆరోపణలు వచ్చిన్నాయని. వారికి షోకాజ్ ను ఎందుకు జారీ చేయలేదని పార్టీలో అందరినీ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒక వర్గాన్ని ఒకలాగా మరో వర్గాన్ని మరోలా చూడకూడదని పార్టీలో అందరు సమానమైనవి తారతమ్యం లేనటువంటి వ్యవస్థలో భాగంగా తప్పు చేసినవారికి తక్షణమే షోకాజ్ జారీ చేసి పార్టీ నుండి తొలగించాలని కోరారు.

Spread the love