మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది.. ఇద్దరి హత్య, ఇళ్ల దహనం

ప్రతిపక్షం, జూన్ 12: మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మకంగా మారాయి. కామ్‌జోంగ్ జిల్లాలోని కుల్తుహ్ ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లు దాడి చేసి కుకీ తెగకు చెందిన ఇద్దరిని హత్య చేశారు. పలువురు నివసిస్తున్న ఇళ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. ఇటీవల అదృశ్యమైన ఆరుగురు నాగాల మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో ఈ దాడి ప్రతీకార చర్యగా జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మరికొన్ని ప్రాంతాల్లో కూడా దహనకాండలు జరిగినట్లు సమాచారం. భద్రతా బలగాలు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Spread the love

Related News

Latest News