నీట్ ఆందోళనల వేళ విద్యార్థులతో చర్చలకు కేంద్రం ఆహ్వానం

ప్రతిపక్షం, జూలై 23: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విద్యార్థులు, CJP ప్రతినిధులను మరోసారి చర్చలకు ఆహ్వానిస్తూ కీలక ప్రకటన చేశారు.

విద్యార్థులకు అనుకూలమైన సమయంలో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన జితేంద్ర సింగ్, జరగబోయే చర్చల్లో తాను, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొంటామని చెప్పారు.

అయితే చర్చలు ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా జంతర్‌మంతర్ లేదా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలో నిర్వహించాలని నిరసనకారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం–విద్యార్థి సంఘాల మధ్య చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News