ప్రతిపక్షం, జూలై 25: నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రిజైన్ విషయంపై ఇవాళ మధ్యాహ్నం వరకు సీజేపీ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. కాసేపట్లో మరో దఫా చర్చలు జరగాల్సి ఉండగా ఆయన రాజీనామా చేశారు.అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన తప్పుకోగా, త్వరలో కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు జరగనున్నాయి.

















