Trending Now

​వైఎస్​ అడుగుజాడల్లో సీఎం రేవంత్..

రేవంత్​కు చేవెళ్ల సెంటిమెంట్​..

27న చేవేళ్లలో భారీ సభ..

రూ.500 సిలీండర్​, 200యూనిట్ల విద్యుత్​ ఫ్రీ పథకాలు లాంచ్​..

కాంగ్రెస్​ ఆగ్రనేత ప్రియాంకగాంధీ హాజరు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ చేవెళ్ల సెంటిమెంట్ ను కొనసాగించనుంది. దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను దాదాపుగా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్​, ఆసర పెన్షన్లు, చేవేళ్ల ‌‌ ‌‌‌‌ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి సైతం చేవెళ్ల సెంటిమెంట్​ను కొనసాగించబోతున్నారు. ఇందుకుగాను ఈనెల 27న ప్రారంభించనున్న రూ.500 గ్యాస్​ సిలీండర్​, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ పథకాన్ని చేవేళ్ల నుంచే ప్రారంభించనున్నారు. ఇక్కడ భారీ సభ ఏర్పాటు చేసి ఈ పథకాలను ప్రజల మధ్యనే ప్రారంభించాలని తలపెట్టారు. ఇందుకుగాను సభ స్థలాన్ని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు.

ఈ సభకు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​కు చెందిన ఇతర కీలక నేతలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్, రూట్ మ్యాపింగ్, సభ నిర్వహణ తదితర విషయాలపై పలు సూచనలు చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్, రూట్ మ్యాపింగ్, సభ నిర్వహణ తదితర పూర్తి విషయాలపై ఆయన అరా తీశారు, అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూలో రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love