•కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి. నిరంజన్ రెడ్డి
ప్రతిపక్షం, జూలై 24, వనపర్తి ప్రతినిధి: వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… పాత,కొత్త వాళ్ల కలియికతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారిలో కందూరు.శాంతయ్య,దండు.లక్ష్మయ్య,కందూరి.ఎల్లయ్య,చిన్న వెంకటస్వామి,దండు.రాజు, పానుగంటి రాజు, సతీష్, పానుగంటి.గోపాల్,రమేష్,పానుగంటి.మహేష్,గొర్ల.రాజు,చరణ్,ఆంజనేయులు,చంద్రారెడ్డి,బాలయ్య,మధు,పానుగంటి రవి ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.

















