ప్రతిపక్షం, జూలై 24: నిరాహార దీక్షను 26 రోజుల తర్వాత విరమించిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన ఆయన, వాంగ్‌చుక్ త్వరగా పూర్తి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.
“మీరు వీలైనంత త్వరగా మునుపటి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటున్నాను. వైద్యుల సూచనలను తప్పకుండా పాటించండి. మీ పాత బరువును కూడా త్వరలోనే తిరిగి పొందాలని ఆశిస్తున్నాను. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌లో సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు ఆయన భార్య గీతాంజలిని కూడా ప్రధాని ట్యాగ్ చేశారు. 26 రోజులపాటు కొనసాగిన నిరాహార దీక్ష అనంతరం వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

















