*చండూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం గాంధీ చిత్రపటానికి, గాంధీ సెంటర్ మరియు గాంధీజీ విద్యా సంస్థల యందు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ… సత్యం, అహింస, శాంతి, సమానత్వం కోసం గాంధీజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. ఎలాంటి హింసకు తావు లేకుండా అహింస మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ చేసిన పోరాటం భారత స్వాతంత్ర ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. సాధారణ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేసి, వారిలో చైతన్యం తీసుకురావడంలో గాంధీజీ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, సామ సుజాత యాదవ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, కల్లెట్ల చంద్రకళ మారయ్య, షేక్ సలీమా షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సాయి భరద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ జగన్, వార్డు ఆఫీసర్ శ్రీరాములు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





























