కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పరిహారం

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 13: సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచింది. ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించి బీమా పొందిన ఎల్లంకి వెంకట్ రెడ్డి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందింది.నంగునూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మృతుడి భార్య, నామిని ఎల్లంకి గీతకు బ్యాంకు మేనేజర్ గోవిందరాం కృష్ణ రూ.రెండు లక్షల బీమా చెక్కును అందజేశారు. ఎల్లంకి వెంకట్ రెడ్డి 2024లో మృతి చెందారు. ఆయన బ్యాంకు ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరి ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తూ బీమా రక్షణ పొందారు. దీంతో నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. ఈ మొత్తం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది.

ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ గోవిందరాం కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో పాటు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలోనూ చేరి తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని కోరారు. తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా, జీవిత బీమా రక్షణ పొందే అవకాశాన్ని ప్రతి ఖాతాదారుడు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News