ప్రతిపక్షం, జూలై 04: తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ సర్క్యులర్ స్కైవాక్ నిర్మించడంతో పాటు నాగార్జునసాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం ఏర్పాటు చేయనుంది.
ఈ మూడు ప్రధాన పర్యాటక కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బౌద్ధ సర్క్యూట్ ప్యాకేజీని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుంది.
















