రేపు మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 02: మెదక్ జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రజలకు రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా కు సరఫరా చేయలేకపోతున్నామని పట్టణ ప్రజలు తమకు సహకరించాలని మెదక్ పట్టణ మున్సిపల్ కమిషనర్ నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. సింగూరు డ్యామ్ నుండి వచ్చే మిషన్ భగీరథ నీటి సరఫరా. పెద్దరెడ్డిపేటలోని 90 MLD WTP నుండి రాయపహాడ్ 1200KL OHBRకు వెళ్లే 1100mm DI ట్రంక్ మెయిన్ పైపులైన్‌లో లీకేజీ కారణంగా, మెదక్ పట్టణమునకు నీటి సరఫరా నిలిపి వేసినారు.కావున రేపు అనగా తేదీ (03.07.2026 )శుక్రవారం రోజున పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు.కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించాలని మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ తెలిపారు

Spread the love

Related News

Latest News