Trending Now

పవర్‌ఫుల్ డైలాగ్‌తో బాలయ్య మూవీ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘NBK 109’. ఈ చిత్రం కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో టైటిల్ గా ఎన్‌బీకే 109 గా చూపించారు. NBK అంటే నేచురల్ బోర్న్ కింగ్ అని ఈ గ్లింప్స్ లో చెప్పుకొచ్చారు. అలాగే బాలయ్య.. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్ హంటింగ్ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Spread the love

Related News