Trending Now

సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 08: రెండు రోజుల క్రితం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయోధ్య రాముని అక్షింతలను అవమానపరచడం పట్ల విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అవి బాల రాముని అక్షతలు కావు రేషన్ బియ్యంలో పసుపు కలిపి రేషన్ బియ్యం అని అయోధ్య బాల రాముని అక్షింతలను సీఎం రేవంత్ మాట్లాడటంపై వీహెచ్‌పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మెదక్ సహకార దర్శి గ్యాదరి రాజారాం మాట్లాడుతూ.. గంగానీరు ఒక చుక్క తీసుకొచ్చి ఎన్ని నీళ్లలో కలిపిన ఆ నీళ్లకు పవిత్రం ఉంటుందని, అలాగే అయోధ్య శ్రీ బాల రాముని పాదాల కింద నుండి వచ్చిన బియ్యం ఏ బియ్యమైనా ఆ బియ్యానికి పవిత్రత ఉంటుందని తెలిపారు. అలాగే ప్రతిసారి హిందూ దేవి దేవతలను ఇలాగే ప్రతి రాజకీయ నాయకులు అవమాన పరుస్తా ఉన్నారని మండి పడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా మీయొక్క క్యాంప్ ఆఫీసులు రాస్తారోకలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి బుస్స నరేష్, బజరంగ్దళ్ సిద్దిపేట జిల్లా సంయోజక్ ఎక్కల దేవి శ్రీనివాస్, సహా సంయోజక్ బైరి మురళీ, ధర్మ ప్రసార్ ప్రముఖ పొదీల శ్రీనివాస్, మట్ట మందిర్ ప్రముఖ బచ్చు నాగేందర్, సిద్దిపేట నగర కార్యదర్శి బోనాల శ్రీనివాస్, సిద్దిపేట బజరంగ్దళ్ నగర సంయోజక చిట్టాపురం అనిల్ ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News