Trending Now

రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టండి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 28 : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తక్షణమే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ను ప్రభుత్వం చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డా.ఉప్పు. కృష్ణంరాజు, అధ్యక్షులు ఎంబడి. చంద్రశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. మంగళవారం వారు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కుటుంబాల వారికి రిజర్వేషన్లు ద్వారా చాలా అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మరో వైపు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 42 శాతనికి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేసారు. బీహార్ తరహలో తెలంగాణా అసెంబ్లీలో బీసీ లకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ప్రత్యేక ఆర్డినెస్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News