Trending Now

కాంగ్రెస్ క్యాబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు : మాజీ మంత్రి

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 09: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ తో ములాఖాత్ అయి బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో ముస్లిం మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఫాయిదా అవుతుందన్నారు. బీజేపీ తో పోరాడుతోంది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. అందుకే కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి లేడని, కేసీఆర్ క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం మైనార్టీ నేతకు పదవి ఇచ్చినట్లు గుర్తు చేశారు.

సచార్ కమిటీ నివేదికను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీలైన రూ.4వేల పెన్షన్, రైతులకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ పోయింది.. షాదీ ముభారక్ పోయింది..తులం బంగారం జాడ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సెక్యులర్ లీడర్ అన్నారు. హిందూ, ముస్లింలు రెండు కళ్లులాగా పని చేసినట్లు తెలిపారు. మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ని ఆశీర్వదించాలని కోరారు.మే 13 తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మీకు అందుబాటులో ఉండరన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్,బీఆర్ఎస్ నాయకులు వజీర్, మొయిజ్, అక్తర్ పటేల్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News