ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ నీచ రాజకీయాలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను దేశం గమనిస్తోందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘పార్లమెంట్‌ను అబద్ధాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు. అద్భుత వాగ్ధాటి, దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన కలిగిన రాహుల్ గాంధీని అవమానించేందుకు ఆయన దిష్టి బొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో మీరు ఏమి సాధిస్తారు? ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారు’ అని Xలో ఫైరయ్యారు.
" ఝూట్ బోలో, బార్ బార్ ఝూట్ బోలో " అంటూ పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా నడుపుతూ, మాటిమాటికీ, ముమ్మాటికీ దేశ ప్రజలను మభ్యపెడుతూ, సంస్కారం, విచక్షణ కోల్పోయి సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఫాసిస్టు పాలన నడుపుతున్న నరేంద్ర మోదీ గారు. మీకో సూటి ప్రశ్న. వీరోచిత పోరాటపటిమ, అద్భుత…
— YS Sharmila (@realyssharmila) July 4, 2024