ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు మూడు మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.9గంటలకు పాకిస్థాన్‌ను అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రా.12.30గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ..
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ వేటను మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసి బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన గ్రూపు -ఏ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఐర్లాండ్.. భారత పేసర్ల ధాటికి 16 ఓవర్లలోనే కుప్పకూలింది. 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 97 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లే కోల్పోయి 12.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీ సత్తాచాటగా.. రిషబ్ పంత్(36 నాటౌట్) రాణించాడు.