Trending Now

దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : దేశాన్నిఅభివృద్ధి చేసే సత్త ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ ఎంబడి రాజేశ్వర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని 17 వార్డ్ గాయత్రి పురం లో నిర్మల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాజిద్ హైమద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పది సంవత్సరాలుగా అటు దేశాన్ని బీజేపీ దోచుకుంటే ఇటు తెలంగాణా రాష్ట్రన్ని బీఆర్ఎస్ దోచుకుందని అన్నారు. తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచిన ఆరు గ్యారెంటీలు విజయవంతంగా ముందుకు సాగుతుందని ప్రజలకు ఇచిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని అన్నారు. గత ఆదివారం నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున్న తరలివచ్చిన ప్రజలను చూసి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయి అని అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అయ్యన్నగారి పోశెట్టి, జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు రమేష్, సిరాజ్, స్వర్ణపెట్ శేఖర్, ఖైయుమ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News