Trending Now

పోలింగ్ సిబ్బంది మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి, మార్చి 26: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం. మనుచౌదరి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులు, 1009 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4940 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు.

అందులో 1235 మంది ప్రిసైడింగ్ అధికారులు,1235మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2470 మంది ఇతర పోలింగ్ అధికారులున్నారు. ప్రతి టీమ్ లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి ఆయా శాఖల ద్వారా సమాచారం అందించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రెహమాన్, ఈడీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love