Trending Now

అదిలాబాద్ ఎంపీ సీట్ లక్షా మెజార్టీతో గెలుస్తున్నాం..

రాష్ట్ర మంత్రి సీతక్క..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : తమకు అందిన సర్వేల ఆధారంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని లక్షా మెజార్టీతో గెలుస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క ఆశా భావం వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి జిల్లా పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీ హరి రావు, అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తో కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి అనేక పోరాటాలు చేసి సఫలీకృతమైన నిరుపేద మహిళ ఆత్రం సుగుణ ను గెలిపించుకొని జిల్లా అభివృద్ధికి తోడు నీడగా నిలుద్దామని పేర్కొన్నారు.

అదిలాబాద్ ఎంపీ సీట్ ను గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండి సామాజిక దృక్పథం తో ముందుకు వెళుతున్న, త్యాగాల కుటుంబం ఆస్తి, జాతీయ నేత రాహుల్ గాంధీ భవిష్యత్తు లో శాతం దేశ ప్రధాని అవుతున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయం, సమ సంక్షేమం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తున్న ఇప్పటికే గృహలక్ష్మి కోసం రూ.200 కోట్లు కేటాయించిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్రానికి దక్కిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.ఆయా రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారంతా ఐక్యంగా కలిసిమెలిసిటీ పార్లమెంట్ సీట్ ను గెలుచుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కష్టపడాల్సిందేనని ఆమె ఈ సందర్భంగా హితబోధ చేశారు.

పాత్రికేయుల సేవలకు సముచిత ప్రాధాన్యత

పాత్రికేయుల సేవలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తమదని రాష్ట్రమంత్రి సీతక్క పేర్కొన్నారు. రంగస్థలం ఇతర సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ఇప్పటికే మేనిఫెస్టో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీకి కట్టుబడి ఉండే నాయకుడని స్పష్టం చేశారు. అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల ప్రజలు తనకు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఇస్తున్న ఆధార అభిమానాలు గౌరవం మరువలేనిదని తనకు ఎంపిక అవకాశం కల్పిస్తే తప్పకుండా జిల్లాలో మేలుకొని ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక అబద్ధమైన రీతిలో కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి సత్తు మల్లేష్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నాందేడపు చిన్ను, మైనార్టీల విభాగం జిల్లా అధ్యక్షుడు జూనేద్ మెమన్, మైనార్టీ విభాగం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్, అయ్యన్న గారి పోశెట్టి, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు ఎంబడి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News