ప్రతిపక్షం, జూన్ 18: రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం-2026 కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో నాగలింగం మొక్కను నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం 13,242 నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
అదే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. వనమహోత్సవాన్ని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

















