ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరిన విషయం తెలిసిందే. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని కేఫ్‌లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్న వీడియోను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ప్రజల సాయాన్ని కోరిన ఎన్ఐఏ, ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది. మరోవైపు దాడికి గురైన రామేశ్వర కేఫ్ 8 రోజుల తర్వాత మళ్లీ తెరుచుకుంది.
Rameshwaram cafe blast: NIA releases fresh CCTV footage of suspect, seeks citizens' help in ascertaining identity
— ANI Digital (@ani_digital) March 9, 2024
Read @ANI Story | https://t.co/rYhUAv2ciW#RameshwaramCafe #NIA #cctvfootage pic.twitter.com/g4VLO5Tc3S