Trending Now

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: భానుడి భగభగలకు సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలో అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడగా.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాల పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలో అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడగా.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాల పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. భానుడి భగభగలకు సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వర్షాల కారణంగా వచ్చిన మార్పులతో ప్రజలు రిలాక్స్ అవుతుంటే.. రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలతో పాటు నష్టాలను తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల జిల్లాలో చెట్టుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డివిజన్‌లో కురిసిన భారీ వర్షంతో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వర్షాల కారణంగా వచ్చిన మార్పులతో ప్రజలు రిలాక్స్ అవుతుంటే.. రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలతో పాటు నష్టాలను తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల జిల్లాలో చెట్టుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Spread the love