పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్దాలు

  • కేసీఆర్ హయoలో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ. 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా?
  • గత ప్రాజెక్టులపై సీఎం చేసిన చేసిన ఆరోపణలు ఖండించిన మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 05, వనపర్తి ప్రతినిధి: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్‌ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. ఒక టీఎంసీకి 15 వేల ఎకరాల పంట సాగు అని కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెప్పడం వల్ల పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అబద్దాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వ అప్పులు

ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘటన కేసీఆర్‌దే

కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా ? ఈ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ? అంటు ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం వల్ల ఇప్పుడు రూ.4 వేల కోట్ల భారం పెరిగిందని విమర్శించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు.ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులేనని వెల్లడించారు. 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016 లో బీఆర్ఎస్ పూర్తి చేసిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించారని తెలిపారు. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు కాగా భూసేకరణ అసలే చేయలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.

అబద్ధానికి అంగీ, లాగు వేస్తే..

పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి 30 నెలల్లో ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారని, తాము ఏ ప్రాజెక్టులను అడ్డుకున్నామని నిలదీశారు. అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డిని విమర్శించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటన జరిపి అబద్దాలు వల్లించడం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ లోనే ఇదే స్క్రిప్టు చదివితే ప్రజలకు కొంచెం భారమైనా తగ్గేదని అన్నారు.

Spread the love

Related News

Latest News