[t4b-ticker]

అంజన్న ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 29: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News