Mallik Tej: యూట్యూబర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచారం కేసు నమోదు

Rape case registered against YouTuber Mallik Tej: ఇటీవల కాలంలో సోషల్ మీడియా సెలబ్రెటీలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక, తాజాగా ప్రముఖ యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదైంది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేశాడని, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దుర్భాషలాడాడని పేర్కొంది. దీంతో మల్లిక్ తేజ్‌పై జగిత్యాల జిల్లా పోలీసులు రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Latest News