•పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 4 నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు
•పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె.భాస్కర్
ప్రతిపక్షం, జూన్ 25, వనపర్తి ప్రతినిధి: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డిసిపి.మధుకర్ స్వామి సారధ్యంలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల ఉద్యోగా ల కొరకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సిసి.శ్రీధర్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కొరకు, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లేదా పర క్రియేటివ్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ లేదా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వెబ్సైట్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా జూన్ 24 నుండి దరఖాస్తు చేసుకోగలరు.దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 26 రాత్రి 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు.ఈ అర్హత పరీక్ష జూన్ 28- 2026 రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 47 కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఉమ్మడి మహబూబ్నగర్ కు చెందిన అభ్యర్థులకు వనపర్తి కేంద్రంగా ఉంటుందని, మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సుమారు నాలుగు నెలలు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.సందేహాలకు ఫోన్ :9542433427 నెంబర్ ను సంప్రదించండి.

















