ప్రతిపక్షం, జూలై 06: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన అభిమాన సంఘం నిర్వహించిన కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ మాదిరిగానే ధనుష్ కూడా రాజకీయ ప్రస్థానానికి సిద్ధమవుతున్నారనే చర్చ సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అభిమాన సంఘాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించలేదు. దీంతో ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

















