Trending Now

హుస్నాబాద్ లో హాఫ్​ మారథాన్

హుస్నాబాద్ ప్రతిపక్షం:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం రన్నర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ ఫోర్త్ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్​ రోడ్​ వద్ద నుండి అక్కన్నపేట చౌరస్తా, బస్టాండ్, మల్లెచెట్టు చౌరస్తా, అనభేరి చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి బైపాస్ రోడ్డు నుంచి కార్యక్రమం కొనసాగింది. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో మారథాన్ నాలుగవ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించడం ఎక్కడో మెట్రో నగరాలలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని హుస్నాబాద్ లో నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో హుస్నాబాద్ అనుబంధంగా ఉన్న హనుమకొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి నుండి ఐదవ తరగతి చదివే పిల్లలనుండి చదువుకోని పిల్లలు కూడా రాబోయే రోజుల్లో పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మెట్రో నగరాలలో నిర్వహించే విధంగా స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న విధంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని మంత్రి అన్నారు. 10 కె, 21 కే లను ప్రోత్సహించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ ఐ లేని అనితారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, టి పి సి సి మెంబర్ కేడం లింగమూర్తి , మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఏసిపి వాసాల సతీష్, సిఐలు కొండ్ర శ్రీనివాస్, రఘుపతి రెడ్డి ,ఎస్సై మహేష్, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, భూక్య సరోజన, వల్లపు రాజు, వాల సుప్రజ, కార్యక్రమం నిర్వాహకులు గుంటూరి శ్రీనివాస్ జంగపల్లి ఐలయ్య పీటీలు పట్టణ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love