Trending Now

పిడుగుపాటుతో యువ రైతు మృతి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన యువరైతు పిడుగుపాటుకు గురై మృత్యువాత గురువారం మధ్యాహ్నం ఒకేసారి ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు వేయడమే కాకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మూడో పెళ్లి ప్రవీణ్ 28 అన్న యువరైతు వాన కాలపు సాగు కోసం తన పంట పొలంలో పనిచేస్తుండగా ఒకేసారి భారీ శబ్దంతో పిడుగు పడి సంఘటన స్థలంలోని మృతి గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఈ మేరకు కృతథిహాని స్థానిక పోలీసులు పంచినామా నిర్వహించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రవీణ్ కు భార్య ఒక సంవత్సరపు కుమార్తె ఉంది. పిడుగు రూపంలో మృత్యు ప్రవీణ్ ను కబళించడాన్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీళ్ల పర్యంత మయ్యారు. ఈ మేరకు దిలావర్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News