రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభం

ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీ హెల్త్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త విధానం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు మరింత పారదర్శకంగా, నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తొలి ఆరోగ్య కార్డులను టీఎన్‌జీవో అధ్యక్షుడు జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుకు అందజేశారు.

Spread the love

Related News

Latest News