మళ్లీ కొత్త నోట్లు.. ఈసారి పాలీమర్‌తో!

ప్రతిపక్షం, జూలై 17: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో పాలీమర్ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. తొలుత రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027 నుంచి అన్ని విలువల నోట్లను పాలీమర్‌తో తయారు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త నోట్లు వచ్చినా ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్లు కొనసాగుతాయి. ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నోట్ల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News