ప్రధాన రహదారులను పరిశీలించిన: మున్సిపల్ కమిషనర్ నవీన్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 06: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులను మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ కాంగ్రెస్ నాయకులు కానుగు భూపతిరాజ్. సోమవారం పరిశీలించారు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రధాన రహదారులైన పోస్ట్ ఆఫీస్ నుండి చమన్ వరకు చమన్ నుండి దాయరా రోడ్ వరకు పరిశీలించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గుంతలు లేకుండా వర్షాకాలంలో నీళ్లు నిలువ చేసిన ప్రాంతాలను వర్షానికి దెబ్బతిన్న రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసరమైన రోడ్లపై చేపట్టాల్సిన మరమ్మతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించాల్సిన వాటిపై అధికారుల వివరణ తీసుకున్నారు. వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు భూపతి రాజు మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారులను పరిశీలించడం జరుగుతుందని ముఖ్యంగా ఎక్కడ కూడా వర్షం నీరు నిల్వ లేకుండా చూడడం. గుంతలు లేకుండా చేయడం. పనులు చేస్తామని ఆయన తెలిపారు బతుకుతున్నాయి ఈ కార్యక్రమంలో , కౌన్సిలర్లు మన్సూర్ అహ్మద్, అవారి రాజశేఖర్, గౌస్ ఖురేషి, డి ఈ సత్యనారాయణ, ఈ నితిన్ కాంగ్రెస్ నాయకులు పూసల సంతోష్, అవారి శేఖర్, గాజుల సురేష్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News