శ్మశానవాటికలో నవజాత శిశువు..
ప్రతిపక్షం, హైదరాబాద్: ఎవరి పాప ఫలితమో ఒక నవజాత శిశువు శ్మశానవాటికలో కనిపించింది. హైదరాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్మశానవాటికలో గాయపడి ఉన్న నవజాత శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శిశువును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆటోలు వచ్చిన ఇద్దరు మహిళలు ఆ శిశువును అక్కడ పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. సాకలేకనో, అక్రమ సంబంధ ఫలితమో తెలియదు కానీ ఎవరిదో పాపం చిన్నారికి శాపమైంది.