ప్రతిపక్షం, జూన్ 30: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ బాపూనగర్ రోడ్డు నంబర్-4లో మంగళవారం భారీ పేలుడు సంభవించి స్థానికంగా కలకలం రేగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో ఓ ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలిందని భావించినప్పటికీ, ఘటన స్థలాన్ని పరిశీలించగా సిలిండర్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అసలు పేలుడు ఎలా జరిగిందనే అంశం మిస్టరీగా మారింది.
ఇంటి యజమాని కూడా పేలుడుకు గల కారణాలపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. పేలుడుకు గల అసలు కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
















