Trending Now

విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేస్తున్నాయి : ఎమ్మెల్సీ కవిత

ప్రతిపక్షం, సూర్యపేట: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించించాలని.. ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మంగళవారం నాడు సూర్యపేట జిల్లా మోతె మండలంలోని బుర్కచెర్ల గ్రామంలో ఆస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. వారిని ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. అయితే, విద్యార్థినుల ఆత్మహత్యల సంఘటనల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆక్షేపించారు. భువనగిరి సంఘటనతో పాటు ఇమాంపేట హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్షపూరిత వైఖరిని వీడాలని స్పష్టం చేశారు.

Spread the love