Trending Now

‘సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే’..

సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమేనని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యతలు నుంచి తప్పుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలు.. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ – 1 నుంచి రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టిండు అని ఎద్దేవా చేశారు. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడని.. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదని.. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడని గుర్తుచేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడని తెలిపారు.

రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? మోడీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరతాడు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదు. వంద రోజుల్లో చేస్తా అన్న పనిని కనీసం 250 రోజుల్లో అయినా తర్వాత కూడా చేయవా రేవంత్ రెడ్డి? అందుకే రేవంత్ రెడ్డిని స్పందించాలి అని హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్ కు రేవంత్ రెడ్డి స్పందించాలి. ఆయన మోసం పార్ట్-2 ఇది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదన్నారు. అలాగే ఏపీ రాజకీయాలపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్ననని.. ఇతర చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లో గెలుస్తున్నారు.

మల్లారెడ్డి గారు రాజకీయ అనుభవంతో వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారు. ఈటెల రాజేందర్ ని మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారు. మల్కాజిగిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే. అది ఈటల రాజేందర్ కి కూడా తెలుసు. మల్లారెడ్డి గారు అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమావుతున్నారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన సరే.. శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యం అని తెలిపారు. బీఆర్ఎస్ లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.

Spread the love

Related News