Trending Now

IPL క్వాలిఫైయర్-1లో సన్ రైజర్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL క్వాలిఫైయర్-1లో ఇవాళ సన్ రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. దూకుడు మీదున్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ. బ్యాటింగ్, బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పటిష్ఠంగా ఉంది. బ్యాటర్లు విజృంభిస్తున్నా నిలకడ లేమి బౌలింగ్ సన్ రైజర్స్‌కి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నెగ్గింది.

క్వాలిఫయర్-1లో విజయం ఎవరిది..?

ఐపీఎల్ క్వాలిఫయర్-1లో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో 51 శాతం మంది సన్ రైజర్స్‌కు అనుకూలంగా, 49 శాతం మంది KKRకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొంది. ఏమైనప్పటికీ మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలిపింది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది.

Spread the love

Related News