Trending Now

నిరుద్యోగ యువత కన్న కలలు నేడు సాకారం..

178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు..

రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి..

ప్రతిపక్షం, తెలంగాణ: ఒకనాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్, స్టాఫ్ నర్స్, గురుకులం, సింగరేణి.. మూడు నెలల లోపే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసాం, 63 అదనపు పోస్టులతో గ్రూప్ వన్ , 11062 పోస్టులతో మెగా డిఎస్పి నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ కి చర్యలు చేపట్టామని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో, అనేక కారణాలతో మరణించిన 178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకం చేపట్టాలని వచ్చిన విజ్ఞప్తిల మేరకు నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ జారీ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 2020 సంవత్సరంలో వి.ఆర్.ఓ వ్యవస్థను రద్ధు చేస్తూ కొత్త చట్టం అమలులోకి తెచ్చింది. చట్టం అమలులో భాగంగా వి.ఆర్.ఓ లను ఇతర డిపార్ట్ మెంట్ లలో సర్ధుబాటు చేస్తూ ఉన్న క్రమంలో కొంత మంది వి.ఆర్.ఓ ఉద్యోగులు మనోవేధనకు గురై ఆకాల మరణం చెందారు. ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు

వి.ఆర్.ఓ ల సమస్యలపై దృష్టి సారించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారితో పలుమార్లు చర్చించి, సానుకూల నిర్ణయం తీసు కోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో వి.ఆర్.ఓ వ్యవస్థ రద్దు చేయడం వలన విది నిర్వహణ చేస్తున్న వి.ఆర్.ఓ లు తీవ్రంగా నష్టపోయార ని వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం అమలు కోసం రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు.

Spread the love