ప్రతిపక్షం, తెలంగాణ: నార్సింగ్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీయ కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో.. పల్టీ కొట్టిన కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.