Trending Now

మైనార్టీ ఓట్ల కోసం విశ్వప్రయత్నాలు..

కాంగ్రెస్‌కు మద్దతు కోసం..

నిర్మల్ జిల్లా ఏఐఎంఐఎం అధ్యక్షునితో కలిసిన నాయకులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏఐఎంఐఎం మద్దతు ఎవరికి ఉంటుందో ఏమో గాని జిల్లా ప్రజలు మాత్రం ఆ మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు వారం రోజులే మిగిలి ఉండగా ఏఐఎంఐఎం అధిష్టానం మాత్రం నిర్మల్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల మైనార్టీ ముస్లింల మద్దతు తమ పార్టీ మద్దతు ఎవరికో అనే దాని మీద స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఆందోళన నేలకుంది. అయితే తాజాగా శుక్రవారం రాత్రి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి సత్తు మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ యువజన నాయకుడు సయ్యద్ అర్జుమంద్ లు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ నివాసానికి చేరుకున్నారు.

తమకు మద్దతు ఇవ్వాలని సుమారు అరగంట పాటు పలు విషయాలు చర్చించారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మైనార్టీల ఓట్లు చాలా ప్రభావం చూపేలా ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 52 వేలకుపైగా ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారన్న ప్రగాఢ విశ్వాసం రాజకీయ వర్గాలలో ఉంది. గత శాసనసభ ఎన్నికలలో ప్రధానంగా ముస్లిం మైనార్టీల ఓట్లు నియోజకవర్గాల వారీగా చీలిపోవడంతోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందారని రాజకీయ విశ్లేషకుల వాస్తవ అంచనా. ఈ నేపథ్యంలో అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లు నెల రోజులుగా ఏఐఎంఐ ఎంతో దోస్తీకై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండేవిట్టల్ తో పాటు పలువురు నాయకులు ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు, బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ ను వ్యక్తిగతంగా కలిసి సుమారు గంట పాటు మద్దతు విషయమై చర్చించారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు అదే రీతిన మద్దతు కోసం చర్చలు జరిపారు. ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షులు మాత్రం మద్దతు ఇచ్చే బాధ్యత, తుది నిర్ణయము ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేనిని, ఆయన ఇచ్చే ఆదేశాలుసూచనల మేరకే తాము పనిచేస్తామని బాటంగానే స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News